యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ
చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇందిరానగర్‌కు చెందిన యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు నాయకులు అన్నారు. ప్రవీణ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిని బిక్షంరెడ్డి, జిట్టా చంద్రకాంత్, పాల శివ, కుక్కల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.