BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 25 January 2026, 08:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారం

తెలంగాణ
25 Jan, 2026 - 08:23 AM
384 వీక్షణలు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారం NTODAY NEWS : యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావును “బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీస్ అవార్డు” విభాగంలో రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేశారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ. సుదర్శన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఈ అవార్డును అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది మరియు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లనే ఈ అవార్డు జిల్లాకు దక్కిందని ఆయన పేర్కొన్నారు. #BestElectoralPracticeAward #ElectionExcellence #YadadriBhuvanagiri #DistrictCollector #ElectoralManagement #NationalVotersDay #GoodGovernance #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube