గంపలగూడెం మండలంలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
కొనిజర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా కుంటముక్కల రజని నామినేషన్ దాఖలు
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బుధవారం గంపలగూడెం మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలోని కొనిజర్ల ఎంపీటీసీ స్థానానికి అభ్యర్థిగా కుంటముక్కల రజని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ రావుకు అందజేశారు.
గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు కార్యక్రమం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో స్థానికంగా ఎన్నికల సందడి మొదలైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవభక్తుని సీతారాం ప్రసాద్, బొల్లా కరుణాకర్ రావు, నంబూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.