BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 February 2026, 07:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం

తెలంగాణ
07 Feb, 2026 - 07:52 AM
384 వీక్షణలు
బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ సిరికొండలో ‘బాల వివాహ ముక్త్ భారత్ అభియాన్’ 100 రోజుల ప్రత్యేక ప్రచారం విద్యతోనే మహిళా సాధికారత సాధ్యం: జిల్లా మహిళా సాధికారత కేంద్రం బృందం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాల వివాహ ముక్త్ భారత్ అభియాన్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం బుగ్గరం మండలం సిరికొండ గ్రామ పంచాయతీలో గ్రామ సభతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం బృందం సభ్యులు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల హక్కులు, మహిళా సాధికారతపై వివరించారు. విద్యార్థులకు దిశానిర్దేశం జెండర్ స్పెషలిస్టులు స్వప్న, గౌతమి మాట్లాడుతూ సమాజంలో లింగ సమానత్వం ఎంతో అవసరమని తెలిపారు. బాలురలో చిన్నప్పటి నుంచే లింగ వివక్షత రహిత భావన పెంపొందించాలని సూచించారు. చదువుల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి బాలిక ఉన్నత విద్య అభ్యసించాల్సిన అవసరం ఉందని, విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన సఖి బృందం సభ్యులు లావణ్య, అనురాధ మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. POCSO చట్టం: బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పని ప్రదేశాల్లో వేధింపుల నివారణ చట్టం – 2013 సైబర్ నేరాలు: సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచన అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. షీ టీమ్స్ సేవలు, మానవ అక్రమ రవాణా నిరోధంపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ పంచిత ధర్మరాజు, ఉప సర్పంచ్ గజ్జెల విజయ్, పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, చైల్డ్ లైన్ టీం సభ్యురాలు రజిత తదితరులు పాల్గొన్నారు. #ChildMarriageFreeIndia #BaalVivahMuktBharat #WomenEmpowerment #GenderEquality #EducationForGirls #StopChildMarriage #AwarenessCampaign #ICDS #ChildRights Follow us on Website Facebook Instagram YouTube