BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేచర్లలో బొగ్గు తవ్వకాలను అడ్డుకోవడమే లక్ష్యం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Oct, 2026 - 07:30 PM
26 వీక్షణలు

 పేదల హక్కుల కోసం పోరాటం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఏలూరు జిల్లా, చింతలపూడి: రేచర్ల ప్రాంతంలో బొగ్గు వెలికితీత పనులను అడ్డుకోవడంతో పాటు అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగేంతవరకు పోరాడే సిపిఐ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చింతలపూడి మండలం రేచర్ల ఎంపీటీసీ స్థానానికి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొంత పద్మ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఈరోజు రేచర్ల గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ సిపిఐ అభ్యర్థి దొంత పద్మకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని మన్నవ కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడం వరకు సిపిఐ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ప్రజల జీవనోపాధికి, హక్కులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రేచర్ల ప్రాంతంలో బొగ్గు వెలికితీత పనుల అంశాన్ని ప్రస్తావిస్తూ, వాటి వల్ల స్థానిక ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దేశంలో మతతత్వ రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం సిపిఐ నిరంతరం పోరాడుతోందని వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. రేచర్ల గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన అంశాలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో రేచర్ల ఎంపీటీసీ అభ్యర్థి దొంత పద్మ, సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు, మండల కమిటీ సభ్యులు కంచర్ల గురవయ్య, దంతా కృష్ణ, ఎస్‌కే కాలేషా, తాడిగడప టెక్కిలిపాటి ప్రసాద్ రావు, ప్రజానాట్యమండలి కళాకారుడు ఎస్. లెనిన్ బాబు, జిల్లా కో-కన్వీనర్ తొర్లపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.