BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 10:48 pm
Posted by : KADARI RAMANA

గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి.

తెలంగాణ
Reporter
Kadari Ramana Nirmal Rural
23 Oct, 2026 - 10:48 PM
9 వీక్షణలు
  • గడువులోగా గోదావరి పుష్కరాల పనులు పూర్తి చేయాలి
  • అధికారులను ఆదేశించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు
  • బాసరలో పుష్కర ఘాట్లు, నిర్మాణ పనుల పరిశీలన

బాసర (ఎన్‌ టుడే న్యూస్‌): గోదావరి పుష్కరాలకు సంబంధించిన అన్ని నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ భావిష్‌ మిశ్రాతో కలిసి ఆయన బాసరలో జరుగుతున్న గోదావరి పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదావరి నది పుష్కర ఘాట్లు, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పుష్కరాల సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారి రద్దీకి అనుగుణంగా ఘాట్లు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పుష్కరాల పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పనుల వివరాలను నిరంతరం తమకు అందజేయాలని హనుమంతరావు పేర్కొన్నారు.

పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: కలెక్టర్‌ భావిష్‌ మిశ్రా

బాసరలో గోదావరి పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భావిష్‌ మిశ్రా తెలిపారు. పనుల పురోగతి, వివిధ శాఖల ద్వారా చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను కమిషనర్‌కు వివరించారు.

ప్రతి వారం ఒకరోజు బాసర పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహిస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. పుష్కరాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామని వివరించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పవన్‌ చంద్రతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.