BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 11:05 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దేవాలయ ఆస్తులకు ప్రభుత్వం యజమాని కాదు.. సంరక్షకురాలు మాత్రమే!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 11:05 PM
18 వీక్షణలు

ఏపీలో 87,167 ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణలో

దేవాలయ భూమిని ప్రభుత్వానికి కానుకగా ఇవ్వడం చెల్లదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేవాలయ ఆస్తులపై ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉండవని, వాటిని పరిరక్షించే బాధ్యత మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పులో స్పష్టం చేసింది. దేవాలయానికి చెందిన నిర్దిష్ట రకమైన ఇనాం భూమిని తాత్కాలిక ధర్మకర్త ప్రభుత్వానికి కానుకగా ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఆ బదిలీని చెల్లదని ప్రకటించింది.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో నాగపాలయం మారియమ్మన్‌–పొన్నాచియమ్మన్‌ ఆలయానికి చెందిన ఒక ఎకరం 10 సెంట్ల భూమిని తాలూకా కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా ఇచ్చిన వ్యవహారంపై ఈ తీర్పు వెలువడింది. జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ, జస్టిస్‌ అలోక్‌ ఆరాధే ధర్మాసనం 2026 అక్టోబర్‌ 16న ఈ కేసులో తీర్పు ఇచ్చింది.

దేవాలయ ఆస్తుల నిర్వహణ అంటే వాటిని పరిరక్షించడం, సంస్థ ప్రయోజనాలను కాపాడటమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి దేవాలయ ఆస్తుల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు ఉన్నంత మాత్రాన వాటిపై యాజమాన్య హక్కులు సంక్రమించవని పేర్కొంది. సంబంధిత తమిళనాడు చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ ఇనాం భూమి కానుక చెల్లదని తేల్చింది.

అయితే, ఆ భూమిపై ఇప్పటికే నిర్మించిన తాలూకా కార్యాలయం కొనసాగేందుకు ప్రభుత్వం లీజుదారుగా ఉండటాన్ని కోర్టు అనుమతించింది. ఆలయానికి చెల్లించాల్సిన నెలవారీ అద్దెను రూ.13,235 నుంచి రూ.31,000కు పెంచింది. బకాయిలను చెల్లించాలని, ఆలయానికి రూ.లక్ష ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ దేవాదాయ భూముల పరిరక్షణ అంశం కీలకంగా ఉంది. 2024 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 4.67 లక్షల ఎకరాల దేవాదాయ భూముల్లో 87,167 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు.

దేవాలయ ఆస్తుల పరిరక్షణ, వాటి నిర్వహణలో చట్టబద్ధమైన విధానాలను పాటించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి స్పష్టం చేసింది.