BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 05:48 pm
Posted by : THUNIKI NAGARAJU

NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
16 Oct, 2026 - 05:48 PM
11 వీక్షణలు

సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి

నిరవధిక సమ్మెకు బీజేపీ నేత డాక్టర్ భోగ శ్రావణి సంఘీభావం

20 ఏళ్ల సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

జగిత్యాల: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద NHM జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఆమె సంఘీభావం ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులకు సమాన వేతనం, భద్రత కల్పించాలి

ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా NHM పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. అలాంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.

NHM ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని, వారికి వర్తించే ఇతర అలవెన్సులు అందించాలని కోరారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి, వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భోగ శ్రావణి అన్నారు. ఉద్యోగుల హక్కులను గుర్తించి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. NHM ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కాసేట్టి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ సిరిపురం శ్రీనివాస్, ఆముద రాజు, గట్టిపెళ్లి జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, ఇట్యాల రాము, సింగం పద్మ, రవితేజ, రాజశేఖర్ గౌడ్, కుర్మా రమేష్‌తో పాటు పట్టణ పదాధికారులు, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.