BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

స్థానిక ఎమ్మెల్యే వైఖరి హాస్యాస్పదం

తెలంగాణ
04 Feb, 2026 - 08:29 AM
209 వీక్షణలు
స్థానిక ఎమ్మెల్యే వైఖరి హాస్యాస్పదం: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలకు సంబంధించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలు అందజేశామని, సామాజిక సమీకరణలో భాగంగా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు “ఒకరోజు కాంగ్రెస్ అని, మరోరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం విడ్డూరం. కాంగ్రెస్ బీ-ఫారాలు పొందిన అభ్యర్థుల పక్కన నిలబడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం ప్రజలను వంచించడమే” అని ఆయన మండిపడ్డారు. నిజంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయితే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగంగా పనిచేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధే మా ఆయుధం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు కోరుతామని విద్యాసాగర్ రావు తెలిపారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులతో పాటు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తామని అన్నారు. తాను సామాన్యుడిగా ప్రజల మధ్యే ఉన్నానని, తన కుమారుడు డాక్టర్ సంజయ్ కూడా ప్రజాసేవ లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాడని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: దావ వసంత జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఎమ్మెల్యే కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకునే వారు పార్టీ కార్యాలయానికి వచ్చి, బీఆర్‌ఎస్ కండువా ధరించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #Jagityal #BRSParty #MunicipalElections #PoliticalNews #TelanganaPolitics #PressMeet #UrbanGovernance Follow us on Website Facebook Instagram YouTube