BREAKING
thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్
Date of Publish : 15 October 2026, 09:58 am
Posted by : SEETHA KIRAN KUMAR

రష్యా యువతి–బీహార్ యువకుడి ప్రేమకథ ప్రచారం ఫేక్‌..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 09:58 AM
17 వీక్షణలు

అసలు విషయం ఇదే!

వైరల్ వీడియోపై SATHI సంస్థ స్పష్టత.. తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన “రష్యా యువతి–బీహార్ యువకుడి ప్రేమకథ” ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత సంస్థ SATHI స్పష్టం చేసినట్లు సమాచారం. వీడియోలో కనిపించిన యువతి రష్యాకు చెందినవారు కాదని, ఆమెతో సంబంధం ఉన్న యువకుడు విదేశాలకు వెళ్లాడన్న ప్రచారంలోనూ నిజం లేదని తెలిపింది.

వీడియోలో కనిపించిన యువతి పేరు ఆండ్రియా కొనాలీ (Andrea Connolly). ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు చెందినవారని, SHIVIA అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తరఫున బీహార్‌లో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో పనిచేస్తున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమాలను బీహార్‌కు చెందిన స్థానిక భాగస్వామ్య సంస్థ SATHIతో కలిసి గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించింది.

ఈ కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులు ఆండ్రియా కొనాలీకి స్వాగతం పలికిన సందర్భంలో తీసిన వీడియోను కొందరు వక్రీకరించి ప్రేమకథగా ప్రచారం చేసినట్లు సంస్థ తెలిపింది. వీడియోలో కనిపించిన యువకుడి పేరు రాహుల్ కాదని, నమిత్ అని స్పష్టం చేసింది. అతను విదేశాలకు వెళ్లాడంటూ జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమని పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు SATHI సంస్థ వెల్లడించింది. అవసరమైతే నమిత్‌ను కూడా విచారణలో భాగంగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను నిజానిజాలు నిర్ధారించుకోకుండా షేర్ చేయడం వల్ల అపోహలు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.