BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 07:29 pm
Posted by : కూనురు మధు

తాళ్ల వెల్లంల లో పశువుల అపహరణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Oct, 2026 - 07:29 PM
31 వీక్షణలు
  • చిట్యాల మండలంలో నాలుగు పశువుల అపహరణ
  • ఇద్దరు రైతులకు చెందిన పశువులు మాయం.. పోలీసులకు ఫిర్యాదు

చిట్యాల (ఎన్‌ టుడే న్యూస్‌): నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో పశువుల అపహరణ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు రైతులకు చెందిన నాలుగు పశువులను అపహరించుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. గురువారం రాత్రి పొలాల వద్ద బావుల సమీపంలో కట్టేసి ఉంచిన పశువులు శుక్రవారం ఉదయం కనిపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.

గ్రామానికి చెందిన దోసపాటి శంకర్‌ కురుమడ్ల వెళ్లే దారిలోని తన బావి వద్ద రెండు పశువులను కట్టేసి, రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. అదేవిధంగా జింకల ప్రసాద్‌ మునుగోడు వెళ్లే దారిలోని తన పొలం వద్ద ఒక ఆవు, ఒక ఆవు దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు.

శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా నాలుగు పశువులు కనిపించలేదు. దీంతో బాధిత రైతులు చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పశువుల ఆచూకీ కనుగొని, అపహరణకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు, పశువుల ఆచూకీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.