BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 08:52 pm
Posted by : RAMU JAJU

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని తొండకూర్ ముత్యం ప్రత్యేక దీక్ష

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
15 Oct, 2026 - 08:52 PM
15 వీక్షణలు

తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన ఆర్మూర్‌కు చెందిన ముత్యం

నిజామాబాద్ (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన తొండకూర్ ముత్యం ప్రత్యేక దీక్ష చేపట్టారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ముత్యం బాధపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాలని ముత్యం దుర్గమ్మకు మొక్కుకున్నట్లు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆయన తన మొక్కు నెరవేరిందని భావించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముత్యం మరో దీక్షకు శ్రీకారం చుట్టారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు కేవలం ఉదయం పూట మాత్రమే పాలు తాగుతూ  దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తన దీక్షను కొనసాగిస్తానని తొండకూర్ ముత్యం పేర్కొన్నారు.