ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి
- తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేత
- కౌన్సిలర్ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి విజయానికి ప్రచారం
- ప్రజల సమస్యలపై ఆరా
- గీతాకుమారిని గెలిపించాలని విజ్ఞప్తి
- ప్రచారంలో పాల్గొన్న నాయకులు
పులివెందుల | ఎన్ టుడే న్యూస్: పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు తూగుట్ల మధుసూదన్ రెడ్డి పర్యటించారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి విజయాన్ని లక్ష్యంగా చేసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లిన తూగుట్ల మధుసూదన్ రెడ్డి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వార్డుల్లో తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, గుంతలమయమైన రోడ్ల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన మధుసూదన్ రెడ్డి ప్రచార సమయంలోనే సంబంధిత మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా తూగుట్ల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల పట్టణ సమగ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తూగుట్ల గీతాకుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
టీడీపీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శాయం, అక్రమ్, ఫయాజ్, శివ, బాషా, గణితం, ఆటో సురేష్, అజీజ్, ఆసిఫ్, ముజీబ్‌తో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.