భార్యను లాడ్జికి తీసుకెళ్లి.. బీర్ బాటిల్తో కొట్టి హత్య
మదనపల్లెలో దారుణ ఘటన
హత్య అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త లొంగుబాటు
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు వెల్లడి
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. అర్ధరాత్రి ఆమెతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో బీర్ బాటిల్తో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
కర్ణాటకలోని ముల్బాగల్ ప్రాంతానికి చెందిన నవీద్ బాషా, రుబియా తాజ్ భార్యాభర్తలు. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం రాత్రి వీరిద్దరూ మదనపల్లెలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. రాత్రి వరకు ఇద్దరూ సాధారణంగానే ఉన్నట్లు సమాచారం.
అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నవీద్ బాషా బీర్ బాటిల్తో భార్యపై దాడి చేయడంతో ఆమె మృతిచెందింది.
హత్య అనంతరం నవీద్ బాషా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.