BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 09 March 2026, 02:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం

తెలంగాణ
09 Mar, 2026 - 02:08 AM
422 వీక్షణలు
శ్రీశైలంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబా నృత్యకళాశాల, నందికొట్కూరు బృందం ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం నుంచి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక, ప్రణవాలయ పాహి, నా స్వామి మల్లయ్య, భో.. శివశంభో తదితర గీతాలకు వెంకట తులసి, రామతులసి, అంబిక, కోమలి, భ్రమరాంబ తదితరులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాచీన సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ శ్రీస్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలు పరిపూర్ణంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. #Srisailam #BhramarambaTemple #CulturalProgram #TraditionalDance #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube