BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 January 2026, 11:01 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

తెలంగాణ
15 Jan, 2026 - 11:01 PM
348 వీక్షణలు

ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ NTODAY NEWS: నల్గొండ జిల్లా  సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకేసారి భారీగా వాహనాలు హైదరాబాద్ నగరానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ హైవే–65 (విజయవాడ–హైదరాబాద్)పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ దారి మళ్లింపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 🚦 దారి మళ్లింపు వివరాలు 1️⃣ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ → హైదరాబాద్ 2️⃣ మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి → చింతపల్లి → మాల్ → హైదరాబాద్ 3️⃣ నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (NH-65) → హైదరాబాద్ 4️⃣ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ → హైదరాబాద్ 5️⃣ NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి గుండా హైదరాబాద్ వైపు వాహనాలను మళ్లిస్తారు. 🚔 జిల్లా ఎస్పీ వ్యాఖ్యలు సంక్రాంతి పండగ అనంతరం ప్రజలు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ వల్ల ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు పోలీస్ సూచనలను పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు అనుసరించి ఓర్పుతో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. పండగ రోజులలో కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. #TrafficDiversion #SankrantiTraffic #HyderabadTraffic #NH65 #RoadSafety #TrafficAdvisory #TravelSafe #TelanganaPolice Follow us on Website Facebook Instagram YouTube