BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 12 February 2026, 09:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కీసరగుట్టలో ట్రాఫిక్ మళ్లింపులు

తెలంగాణ
12 Feb, 2026 - 09:28 AM
327 వీక్షణలు
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా కీసరగుట్టలో ట్రాఫిక్ మళ్లింపులు NTODAY NEWS: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15, 2026 ఆదివారం మహాశివరాత్రి పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు మల్కాజ్‌గిరి కమిషనరేట్ ట్రాఫిక్–I డిప్యూటీ కమిషనర్ తెలిపారు. జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు భారీ వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. మళ్లింపుల వివరాలు -ORR / చేర్యాల్ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే భారీ వాహనాలు: కీసర గ్రామం వైపు అనుమతించరు. కీసర ORR వద్ద నుంచి ఘట్‌కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు ORR / సర్వీస్ రోడ్డు ద్వారా మళ్లిస్తారు. ఉద్దేమర్రి, బొమ్మలరామారం నుంచి వచ్చే వాహనాలు: కీసర గ్రామం క్రాస్ రోడ్డు వైపు అనుమతి లేదు. రంగాపురం చౌరస్తా వద్ద నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. -షామీర్‌పేట్ నుంచి వచ్చే వాహనాలు: యాద్గరిపల్లి వద్ద క్రాస్ రోడ్డు నుంచి ఘట్‌కేసర్ వైపు మళ్లించి, ORR సర్వీస్ రోడ్డు లేదా చేర్యాల గ్రామం మీదుగా ECIL వైపు దారి మళ్లిస్తారు. -బోగారం నుంచి వచ్చే వాహనాలు: వన్నెగూడ క్రాస్ రోడ్ వద్ద నుంచి కీసర దయారా మీదుగా ORR వైపు, అక్కడి నుంచి ఘట్‌కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు మళ్లిస్తారు. భక్తులు మరియు పౌరులు పై సూచనలను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. #Keesaragutta #MahaShivaratri #TrafficDiversions #Medchal #RachakondaPolice #HyderabadTraffic Follow us on Website Facebook Instagram YouTube