అత్తాపూర్‌లో విషాదం.. వీసా ఆందోళనతో యువకుడి ఆత్మహత్య
తెలంగాణ
/
హైదరాబాద్
- అమెరికా చదువుల కోసం రెండోసారి వీసాకు దరఖాస్తు
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: అమెరికాలో చదువుకోవాలనే లక్ష్యంతో వీసా కోసం ప్రయత్నిస్తున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్ తేజస్వీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
తేజస్వీనగర్‌లో నివసిస్తున్న రోహిత్ రెడ్డి (26) గతంలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. దీంతో రెండోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈసారి కూడా వీసా వస్తుందో లేదోనన్న ఆందోళనతో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.