తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
జాతీయం
సినిమా వార్తలు
ఎన్ టుడే న్యూస్: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (75) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
తన సంగీత ప్రస్థానంలో కృష్ణరాజ్ 3,000కు పైగా పాటలు పాడారు. వీటిలో సుమారు 300 సినిమా పాటలు ఉన్నాయి. తన గాత్రంతో తమిళ సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మరణించిన ఐదు రోజులకే కృష్ణరాజ్ మృతి చెందడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. దేవాతో కలిసి కృష్ణరాజ్ పలు చిత్రాలకు పనిచేశారు. ఇద్దరి మరణాలతో తమిళ సినీ సంగీత అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కృష్ణరాజ్ మృతిపట్ల సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.