సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జాగింగ్ చేస్తున్న ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరొకరు మృతి
మరో వ్యక్తికి తలకు బలమైన గాయాలు
సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాగింగ్ చేస్తున్న ముగ్గురిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
జనగాం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న డీసీఎం వాహనం జాగింగ్ చేస్తున్న ముగ్గురిని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మృతులను గుఱ్ఱం సైదులు, అలకుంట్ల నాగరాజుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
ఒకే ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.