BREAKING
thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు
Date of Publish : 17 October 2026, 06:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయపట్నంలో పత్తి ఉత్పాదకత పెంపుపై రైతులకు శిక్షణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 06:38 PM
6 వీక్షణలు

యాసంగిలో తక్కువ నీటి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి: మండల వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్

ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామంలో జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్‌లో భాగంగా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్ పత్తి సాగులో ఆధునిక పద్ధతులు, దిగుబడి పెంపు, సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాసంగి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో భాగంగా 90×15 సెంటీమీటర్ల దూరంతో మొక్కలు నాటడం ద్వారా నిర్ణీత విస్తీర్ణంలో మొక్కల సంఖ్యను పెంచుకోవచ్చని వివరించారు. పంట దశను బట్టి 40, 60 రోజుల సమయంలో వ్యవసాయ శాఖ సిఫార్సుల మేరకు వృద్ధి నియంత్రకాలను వినియోగించడం ద్వారా మొక్కల పెరుగుదలను నియంత్రించవచ్చని తెలిపారు. పంటను ఒకేసారి కోతకు అనుకూలంగా నిర్వహించడం ద్వారా కోత ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు యాసంగి సాగుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే పంటల సాగును పరిమితం చేసి తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. భూమి స్వభావం, అందుబాటులో ఉన్న నీటి వనరులు, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని శనగ, పెసర, మినుము వంటి పంటలను అనుకూలతను బట్టి సాగు చేయాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, పంటల ఎంపికలో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపి, ఆత్మ డైరెక్టర్ గోపాల్ రావు, మండల వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రైతులు పాల్గొన్నారు.