ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. చాట్రాయిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్వో బి.ఏ. సత్యనారాయణ, జోనల్ అధికారి వి.ఎస్.వి. బ్రహ్మచారి పాల్గొనగా, శిక్షకులుగా ఎస్. నరసింహారావు, జి.అమరయ్య వ్యవహరించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులకు అవసరమైన సూచనలు, శిక్షణ అందించారు.