BREAKING
thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
Date of Publish : 22 October 2026, 06:47 pm
Posted by : PAGADALA DEVAIAH

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
22 Oct, 2026 - 06:47 PM
40 వీక్షణలు
  • లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి: ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినతి
  • అక్రమ కేటాయింపులు జరిగితే సహించేది లేదు: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలను అరికట్టి, పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, మహేశ్వరం, అంబర్‌పేట నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ అంశాలను ఆధారాలతో సహా ప్రత్యేక కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సిఫారసులతో కేటాయింపులు చేస్తున్నారని ఆరోపణ

నిజమైన పేదలకు ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, మంత్రులు, అధికారుల సిఫారసుల ఆధారంగా లాటరీ పద్ధతి పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపులు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. అలాగే నియోజకవర్గాల్లో ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్ణయాలకు వదిలేయడం వల్ల అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

అక్రమ కేటాయింపులను సహించేది లేదు

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, నిజమైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అక్రమ మార్గాల్లో ఇతరులకు కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు.

అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా కేటాయింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, లాటరీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.