టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు గుంటూరుకు చెందిన కే.సీ. ఆగ్రో ఫార్మ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది. ఆదివారం సంస్థ ప్రతినిధులు ఈ విరాళాన్ని ట్రస్టుకు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ విరాళం ఉపయోగపడనుంది. భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదం అందించేందుకు దాతలు అందిస్తున్న విరాళాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.