BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 October 2026, 09:52 am
Posted by : SEETHA KIRAN KUMAR

జనగణన–2027పై జీడబ్ల్యూఎంసీ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 09:52 AM
9 వీక్షణలు

శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి: కమిషనర్ టి. వెంకన్న

హనుమకొండ: జనగణన–2027 రెండో దశ జనాభా గణనకు సంబంధించి హనుమకొండ జిల్లా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. రెండో రోజు ముగింపు సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనగణన దేశ పరిపాలన, అభివృద్ధి ప్రణాళికలకు ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారు. మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌ (హెచ్‌ఎల్‌ఓ) ద్వారా రూపొందించిన హౌస్ లిస్టింగ్ బ్లాకులను రెండో దశ జనాభా గణనకు అవసరమైన ఎన్యుమరేషన్ బ్లాకులుగా మార్చే ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, జనగణనకు సంబంధించిన నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.