బిల్లుల మంజూరుకు 25 శాతం కమీషన్ డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
భూపాలపల్లి జిల్లాలో పీఎంకేఎస్‌వై అధికారులపై అవినీతి నిరోధక శాఖ చర్యలు
భూపాలపల్లి: పనుల బిల్లుల మంజూరుకు కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై)కు చెందిన ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అదుపులోకి తీసుకుంది. సుమారు రూ.1.62 కోట్ల విలువైన పనుల బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి 25 శాతం కమీషన్‌గా రూ.39 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత బిల్లుల మంజూరు కోసం అధికారులు సతీశ్‌రెడ్డి, రాజు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పలుమార్లు ఆన్‌లైన్ ద్వారా నిందితుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు సమాచారం. తాజాగా మరో రూ.1.34 లక్షల బిల్లుకు సంబంధించి కూడా కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.
ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సంబంధిత కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పేర్లపై ఉన్నట్లు భావిస్తున్న సుమారు 40 ఫోన్‌పే ఖాతాల్లోకి నగదు బదిలీ జరిగిన అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంలో నగదు బదిలీలు, ఖాతాల వివరాలు, బిల్లుల మంజూరుకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.