నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
వార్డు మెంబర్లకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి: పోగుల నాగార్జునరెడ్డి
నాంపల్లి | ఎన్ టుడే న్యూస్: తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం నాంపల్లి మండల కమిటీని రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఆదేశాల మేరకు, ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ పోగుల నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పోగుల నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.
వార్డు మెంబర్ల డిమాండ్లను పరిష్కరించాలి
వార్డు మెంబర్లకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం కేటాయించాలని, ప్రత్యేక ఆరోగ్య హెల్త్ కార్డులు జారీ చేయాలని నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైనా కారణంతో వార్డు మెంబర్ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.
అలాగే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డు మెంబర్ల పేర్లను నమోదు చేయాలని, వారి వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ల హక్కులు, సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
నాంపల్లి మండల ఫోరం నూతన కమిటీకి ఎన్నికైనవారు:
మండల అధ్యక్షుడు: కర్నె యాదయ్య
గౌరవ సలహాదారు: ఉడుత పర్వతాలు
వర్కింగ్ ప్రెసిడెంట్: పగిళ్ల అశోక్
ప్రధాన కార్యదర్శులు: చింతకాయల సత్యనారాయణ, నాగంటి ప్రభాకర్
ఉపాధ్యక్షులు: వేముల మల్లయ్య, గండం మధు, నల్లపు నాగరాజు
సహాయ కార్యదర్శులు: పోలెపాక రమణయ్య, భూషపాక ముత్తు
మహిళా అధ్యక్షురాలు: కోరే ప్రేమలీల
మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్: పల్లేటి శైలజ
మహిళా ఉపాధ్యక్షురాలు: ముదిగొండ రేణుక
యూత్ అధ్యక్షుడు: జక్కల శివ
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఫోరం ప్రతినిధులు ఆకాంక్షించారు.