BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:33 pm
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

మసీదుబండ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన కార్యక్రమం

జాతీయం
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Oct, 2026 - 04:33 PM
21 వీక్షణలు

  • ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్ర కీలకం
  • ఆరు ప్రధాన అంగాలపై అవగాహన
  • ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు
  • విద్యార్థులకు వివరించిన విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ
  • ప్రపంచ శాంతి, సహకారమే ప్రధాన లక్ష్యం

చందానగర్, శేర్లింగంపల్లి | ఎన్ టుడే న్యూస్: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24న మసీదుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రజని అధ్యక్షత వహించారు. చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం, లక్ష్యాలు, విధులపై వివరించారు.

ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న 51 దేశాలతో ఏర్పాటైందని, ప్రస్తుతం 193 సభ్య దేశాలను కలిగి ఉందని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడటం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, మానవ హక్కులను పరిరక్షించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉందని వివరించారు.

ఐక్యరాజ్యసమితికి సాధారణ సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక–సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం అనే ఆరు ప్రధాన అంగాలు ఉన్నాయని వివరించారు. వీటి ద్వారా అంతర్జాతీయ సహకారం, శాంతి పరిరక్షణ, న్యాయ వివాదాల పరిష్కారం, సామాజిక–ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై కృషి జరుగుతుందని తెలిపారు.

అలాగే యునెస్కో, యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వంటి సంస్థలు విద్య, ఆరోగ్యం, బాలల సంక్షేమం, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి తదితర రంగాల్లో పనిచేస్తున్నాయని వివరించారు.

ఆయుధ పోటీ, ఉగ్రవాదం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, పేదరికం, నిరుద్యోగం, అంతర్జాతీయ వలసలు వంటి సమస్యలు ప్రపంచ దేశాలకు సవాళ్లుగా మారాయని డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి దేశాల మధ్య పరస్పర సహకారం, శాంతియుత చర్చలు, అంతర్జాతీయ బాధ్యతల పట్ల నిబద్ధత అవసరమని అన్నారు.

ప్రపంచ శాంతి, అభివృద్ధి సాధనలో ఐక్యరాజ్యసమితి పాత్రను విద్యార్థులు అర్థం చేసుకోవాలని, అంతర్జాతీయ సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు డాక్టర్ అంబేద్కర్, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.