ఉరుమడ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
ఉరుమడ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాలు
స్థలం: ఉరుమడ్ల
ఉరుమడ్ల గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు మెంబర్ జన్నపాల శ్రీను, ఆడపు భిక్షం, జన్నపాల మల్లయ్య,దుబ్బ యాదయ్య, జన్నపాల గోపాల్, పెండేలా యాదయ్య,కోరబోయిన వెంకటేశం, జన్నపాల కిరణ్ కుమార్,జన్నపాల లింగస్వామి,పందుల గోపాలు, జన్నపాల స్వామి, వడ్డేపల్లి నరసింహ, వసుకుల శంకర్, కోర బోయిన వేణుమాధవ్, జన్నపాల శ్రవణ్ కుమార్, జన్నపాల ప్రేమ్ కుమార్ , పెండేలా ప్రభు కుమార్ ,ద తర గ్రామ ప్రముఖులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రత్యేకంగా ప్రార్థించారు.