ఉర్సు రంగలీల మైదానం దసరా ఉత్సవాలు.. ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
- భారీ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు
- ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు
అక్టోబర్ 20 మధ్యాహ్నం 3 గంటల నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు అమలు
వరంగల్: ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల సందర్భంగా ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అక్టోబర్ 20, 2026న మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 21న ఉదయం 3 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే వాహనాలు: ఫున్నెలు క్రాస్, ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి.
కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు: కేయూసీ, పెద్దమ్మగడ్డ, హనుమాన్ జంక్షన్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్ రోడ్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు: కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, ఫున్నెలు క్రాస్ మీదుగా వెళ్లాలి.
దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
హన్మకొండ హంటర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలకు:
కొలంబో హాస్పిటల్ సమీపంలో
బీఆర్ నగర్ ఎదురుగా ఉన్న గానుగ ఆయిల్ పాయింట్ వద్ద
ఆకుతోట ఫంక్షన్ హాల్ వద్ద
నాని గార్డెన్ వద్ద
జేఎస్ఎం స్కూల్ వద్ద
కడిపికొండ నుంచి వచ్చే వాహనాలకు:
భారత్ పెట్రోల్ పంపు వద్ద
ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలకు:
లవ్లీ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఖాళీ స్థలంలో
తాళ్ల పద్మావతి కాలేజీ వద్ద
కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలకు:
భీరన్న గుడి వద్ద
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు, సందర్శకులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని, కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలపాలని సూచించారు.