నిఘా నేత్రంలోకి ఉరుమడ్ల గ్రామం
సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం
ఉరుమడ్ల, అక్టోబర్ 18 (ఎన్ టుడే న్యూస్): గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఉరుమడ్లలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం గ్రామంలో జరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు పనులను గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు, సంఘవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా గ్రామాన్ని పూర్తిగా నిఘా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామంలో భద్రత పెరగడంతో పాటు నేరాల నియంత్రణకు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, వార్డు సభ్యుడు గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు.