BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 08:58 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

వలిగొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి అక్షాన్ష్ యాదవ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
05 Jun, 2026 - 08:58 PM
95 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు వార్షిక తనిఖీలో బాగంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తనిఖీ చేశారు ,ముందుగా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తునా సిబ్బంది యొక్క యూనీఫాం దరించే విదానం మరియు వారి యొక్క వ్యక్తి గత సామగ్రి ఉండే పెట్టెను తనిఖీ చేసిన యెడల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని సందర్శించారు. పోలీస్ స్టేషన్ లోపల జనరల్ డైరీ పరిశీలించిన తర్వాత హెల్ప్ డెస్క్ విదులు అడిగి తెలుసుకున్నారు. సెక్షన్ ఇన్చార్జి వద్ద గల జనరల్ డైరీ ని తనిఖీ చేసి వారి యొక్క విధులను గురించి విచారించారు,కోర్టు రికార్డు గది తనిఖీ చేసి ఎవిడెన్స్ ప్రాపర్టీని ఆర్డర్ లో పెట్టుకోవాలి అని ఆదేశించారు.ఈ పెట్టి ,పిటిషన్ పెండింగ్ ,రెజిస్టర్డ్ పిటిషన్ లను ఎప్పటికీఅప్పుడు సంబందిత రికార్డు లలో పొందుపరచాలని ఆదేశించారు CCTNS ,CISR,పోర్టల్ ల పనితీరును పరిశీలించారు, సైబర్ నేరాల వివరాల యొక్క పాత కేసుల వివరాలను కంప్యూటరు లో తనిఖీ చేశారు,లాక్ అప్ రూమ్ తనిఖీ చేసి వాటిలో గల CCTV ల పనితీరు అడిగి తెలుసుకున్నారు.రౌడీ షీటర్ ల యొక్క రికార్డు లను పరిశీలించి వారి యొక్క ప్రవర్తనల గురించి అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ బయట గల రికవరీ వాహనాల ను పరిశీలించి వాటికి సంబందించిన క్రైమ్ నెంబర్ ని వాటిపైన వేసి వాటి యొక్క నేరాల నెంబర్ ఆధారంగా ఆర్డర్ లో పెట్టాలి అని ఆదేశించారు.ఈ ఇన్స్పెక్షన్ జిల్లా ఎస్పీగారి ఆద్వర్యంలో చౌటుప్పల్ జోన్ డిఎస్పి మధుసూదన్,సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు