వైఎస్సార్‌సీపీకి మాజీ ఎంపీటీసీ రాజీనామా అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత కలిగిన మాజీ ఎంపీటీసీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో మండల రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలు, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనున్నారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.