వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు..
డొంకేశ్వర్: అన్నారం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చౌరస్తాలో చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గంలో జన్మించిన చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలకు ఎదురొడ్డి హక్కుల సాధన కోసం పోరాడిన గొప్ప యోధురాలని అన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ చాకలి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గణేష్, గణపతి, అశోక్ , బోజన్న, గంగాధర్, రజకసంఘం నాయకులు, కుల బాంధవులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.