BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 10 September 2026, 06:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విదేశీ భారతీయులకు ఊరట.. UIDAI కొత్త ఫేస్ అథెంటికేషన్ SDK

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Sep, 2026 - 06:51 PM
44 వీక్షణలు

ఆధార్ ధ్రువీకరణను మరింత సులభతరం చేసేలా కొత్త సాంకేతికత

న్యూఢిల్లీ | Ntoday News

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులతో పాటు దేశంలో ఆధార్ ఆధారిత డిజిటల్ సేవలు వినియోగించే వారికి మరింత సౌకర్యం కల్పించే దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ముందడుగు వేసింది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను వివిధ యాప్‌లలో నేరుగా అనుసంధానించుకునేలా కొత్త ఫేస్ అథెంటికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK)ను UIDAI అందుబాటులోకి తీసుకొచ్చింది. 

కొత్త SDKతో బ్యాంకులు, ఫిన్‌టెక్, ఇన్సూరెన్స్ సంస్థలు తమ మొబైల్ యాప్‌లలోనే ఆధార్ ఆధారిత ఫేస్ వెరిఫికేషన్ సదుపాయాన్ని అనుసంధానించుకోవచ్చు. దీంతో వినియోగదారులు ధ్రువీకరణ కోసం ప్రత్యేక యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం తగ్గుతుంది. 

ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్న భారతీయులు ఎదుర్కొనే జియోఫెన్సింగ్, యాప్‌ యాక్సెస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది. డిజిటల్ ఆన్‌బోర్డింగ్, KYC ప్రక్రియలను వేగంగా, సులభంగా నిర్వహించేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుందని UIDAI పేర్కొంది. 

కొత్త SDKతో పాటు సంస్థలు తమ ఇంటిగ్రేషన్‌ను ముందుగా పరీక్షించుకునేందుకు ఫేస్ అథెంటికేషన్ శాండ్‌బాక్స్, అమలుకు సంబంధించిన ప్లేబుక్‌ను కూడా UIDAI అందుబాటులోకి తెచ్చింది.