ఎనుమాముల ఈవీఎం గోదాంలో వరంగల్ కలెక్టర్ తనిఖీలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
త్రైమాసిక తనిఖీలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలన
వరంగల్ | Ntoday News
వరంగల్ జిల్లా కలెక్టర్ త్రైమాసిక తనిఖీలో భాగంగా ఎనుమాముల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాం పరిసరాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈవీఎంల భద్రత, భద్రపరిచే విధానంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.