వరంగల్‌లో ఘనంగా గురుపూజోత్సవం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు.. ప్రశంసా పత్రాల అందజేత
వరంగల్ | Ntoday News
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్‌తో కలిసి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యా రంగంలో అంకితభావంతో సేవలందిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.