వాసంశెట్టి అనసూయమ్మ పెద్దకర్మ - మున్నూరు కాపు సంఘం తరపున ఘన నివాళులు
మధిర మండలం దెందుకూరు దగ్గరలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో మధిర పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ సర్పంచ్ వాసంశెట్టి కోటేశ్వరరావు, వాసంశెట్టి వెంకటేశ్వర్లు తల్లిగారైన వాసంశెట్టి అనసూయమ్మ పెద్దకర్మ కార్యక్రమం శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల నుండి తరలివచ్చిన నాయకులు ముందుగా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అనసూయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనసూయమ్మ గారు ఆదర్శవంతమైన జీవితం గడిపి కుటుంబానికి, సమాజానికి ఎంతో సేవ చేశారని, ఆమె మృతి కుటుంబానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నియోజకవర్గ అధ్యక్షులు ఆళ్ల కృష్ణ, జిల్లా గౌరవ ఉపాధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మధిర టౌన్ అధ్యక్షులు దేవిశెట్టి కృష్ణ, కార్యవర్గ సభ్యులు పసుపులేటి సత్యనారాయణ, జున్ను సుదర్శన్, రామిశెట్టి శ్రీనివాసరావు, మత్తి నాగేశ్వరరావు, మానేడి సంపత్, యూత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇల్లూరి నవీన్, ఎర్రుపాలెం మండల నాయకులు కత్తి రవి, కోటపాటి పాండురంగారావు, కామిశెట్టి బాబు, వెంకట్, నారాయణ, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.