జి.కొండూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ నామినేషన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు: జి.కొండూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల మాజీ ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం విజయవాడలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో తన భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావుతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ ఆశీస్సులతో ఆమె అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జి.కొండూరు మండలంలో జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.