గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. క్రీడలతో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి, అక్టోబర్ 19: దసరా పండుగ సందర్భంగా జీలుగుమిల్లి మండలం గోపాలపురం గ్రామంలో లంకాలపల్లి, గోపాలపురం యువత ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.
యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. దసరా పండుగ వేళ యువత క్రీడా పోటీల్లో పాల్గొనడం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ కార్యక్రమంలో పి. రామకృష్ణ, కె. ప్రసాద్, టి. నాగరాజు, కె. ప్రేమ్, కె. విజయ్, కె. వెంకటేశ్వరరావు, ఎం. గంగాధర్, కె. సాగర్, జి. రాహుల్ తదితరులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎన్‌టుడే న్యూస్ రిపోర్టర్: వీరమల్ల శ్రీను