BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 23 October 2026, 12:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సీపీ

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 12:45 PM
17 వీక్షణలు

పోలీస్ స్టేషన్ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేదు

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

వరంగల్ (ఎన్‌ టుడే న్యూస్‌): పోలీస్ స్టేషన్ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. గురువారం ఆమె ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ షుకూర్‌కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను శ్రద్ధగా విని, పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు నమ్మకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు.

ఈ తనిఖీలో వరంగల్ ఇన్‌చార్జి ఏసీపీ నర్సింహరావుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.