వరంగల్: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తెలంగాణ
/
వరంగల్
చింతలపల్లి–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన.. ఎంజీఎం మార్చురీలో మృతదేహం భద్రపరిచిన పోలీసులు
వరంగల్: చింతలపల్లి–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని రైలు నుంచి పడి సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని వరంగల్ రైల్వే జీఆర్పీ సీఐ నరేష్ కుమార్ తెలిపారు.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై ఆర్హెచ్సీ ఎస్. రవీందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిని గుర్తించగలిగినవారు లేదా సంబంధిత సమాచారం తెలిసినవారు వరంగల్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.