BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 January 2026, 06:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రజక వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ
13 Jan, 2026 - 06:11 AM
214 వీక్షణలు

రజక వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

రజకులకు సామాజిక భద్రత కల్పించాలి: ఫైళ్ళ ఆశయ్య NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్  చౌటుప్పల్ మండలం మున్సిపల్ రజక వృత్తిదారుల సంఘం 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను చౌటుప్పల్ బస్టాండ్ వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు భాతరాజు యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు కానుగు బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల హక్కుల సాధనలో రజక వృత్తిదారుల సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. గత సంవత్సరం సంఘం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా కొన్ని హక్కులు సాధించగలిగామని, ఇంకా మిగిలిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు: 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజక వృత్తిదారుడికి వృద్ధాప్య పెన్షన్ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు రుణాలు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చౌటుప్పల్ మున్సిపాలిటీలో కమిటీ హాల్ స్థలం కేటాయించి భవన నిర్మాణానికి నిధులు చౌటుప్పల్ మోడ్రన్ లాండ్రీ యూనిట్ల పనులు వెంటనే పూర్తి చేసి వృత్తిదారులకు అందజేయడం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కేతరాజు అచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి సామాకూర యాదయ్య, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు భాతరాజు దశరథ, మలిగే బాలకృష్ణ, మండల ఉపాధ్యక్షులు మలిగే నరసింహ, కానుగు శివకుమార్, ముదిగొండ వెంకటేష్, పెడకంటి లింగస్వామి, కొలుకులపల్లి సాలయ్య, బొల్లారం లక్ష్మీనారాయణ, భాతరాజు యాదయ్య, కేతరాజు శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ భాతరాజు సాయిలు, ఎస్ లింగటం, బాతరాజు ధనంజయ్, మలిగే కృష్ణ, మలిగే చంద్రయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మండల రజక వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లు: కానుగు శివకుమార్ ఉపాధ్యక్షుడు #RajakaCommunity #Choutuppal #CalendarLaunch #SocialSecurity #WeaverAndWashermenRights #CommunityDevelopment #TelanganaNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube