BREAKING
thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 10:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నీరు, విద్యుత్‌ వినియోగాన్ని 20 శాతం తగ్గించాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 10:20 PM
12 వీక్షణలు
  • హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి సూచనలు
  • ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలు నిలిపివేయాలని ఆదేశాలు

హైదరాబాద్‌ | ఎన్ టుడే న్యూస్‌:

రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, హైదరాబాద్‌ నగరవాసులు నీరు, విద్యుత్‌ వినియోగాన్ని 20 శాతం తగ్గించుకోవాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB) సూచించింది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్‌ ప్రజలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.

నీటి వృథాను అరికట్టడంతో పాటు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా నీటిని అవసరమైన మేరకే వినియోగించాలని, అనవసరంగా కుళాయిలను తెరిచి ఉంచడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ ఆదా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలను నిలిపివేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఏసీలు వినియోగించినా ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉంచాలని సూచించారు.

అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ముందు లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు సహా అవసరం లేని విద్యుత్‌ పరికరాలన్నింటినీ ఆపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.

నీరు, విద్యుత్‌ ఆదా చర్యల్లో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని జలమండలి సూచించింది. రానున్న రోజుల్లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలని కోరింది.