BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 03:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు గ్రంథాలయానికి రూ.17,500తో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 03:41 PM
20 వీక్షణలు

విద్యార్థుల సౌకర్యార్థం జె. శ్రీలత సేవాభావం

తిరువూరు, అక్టోబర్ 21: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో తిరువూరు గ్రేడ్‌–1 శాఖా గ్రంథాలయంలో వాటర్ ట్యాంకులు, కుళాయిలు, పైప్‌లైన్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గ్రంథాలయ సిబ్బంది జె. శ్రీలత తన వంతు సహకారంగా రూ.17,500 వెచ్చించి ఈ సదుపాయాలను కల్పించారు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన స్వర్గీయ బత్తుల అంజిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన మనుమరాలు జె. శ్రీలత ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రంథాలయానికి ప్రతిరోజూ తిరువూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడికి వచ్చే పాఠకులకు తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో గ్రంథాలయం కింది అంతస్తు, పై అంతస్తులో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్, పంపులు, కుళాయిలను ఏర్పాటు చేయించారు.

విద్యార్థుల అవసరాలను గుర్తించి గ్రంథాలయ అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని గ్రంథాలయ నిర్వాహకులు, పాఠకులు పేర్కొన్నారు. ఈ సదుపాయాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో పాటు గ్రంథాలయానికి వచ్చే ఇతర పాఠకులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడిన జె. శ్రీలతకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తిరువూరు గ్రేడ్‌–1 శాఖా గ్రంథాలయ నిర్వాహకులు సుంకర నాగేశ్వరరావు వెల్లడించారు.