జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి
- అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి
- టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం
తొర్రూరు | ఎన్ టుడే న్యూస్ | అక్టోబర్ 25:
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమష్టిగా పోరాడి హక్కులను సాధించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదయ్ దీర్ పిలుపునిచ్చారు.
ఆదివారం వరంగల్ జిల్లాలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో టీఎస్‌జేయూ డివిజన్ సమావేశం నిర్వహించారు. యూనియన్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పంతం సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు యూనియన్ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించేలా ఉద్యమించాలని సూచించారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు సూచించారు.
టీఎస్‌జేయూ తొర్రూరు డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక
సమావేశం అనంతరం టీఎస్‌జేయూ తొర్రూరు డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు: పానుగోత్ బాలాజీ
ఉపాధ్యక్షులు: వేర్పుల మహేందర్, మంగళపల్లి నాగరాజు
ప్రధాన కార్యదర్శులు: ధర్మారపు యాకయ్య, జెల్ల శ్రీనివాస్
సహాయ కార్యదర్శులు: తండ రవి, మునిగేటి గిరిధర్
కోశాధికారి: శ్రీనివాస్ చారి
జిల్లా మీడియా ఇన్‌చార్జి: మిడతపల్లి సురేందర్
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సంఘ సభ్యులు పంతం విజేందర్, శ్యామ్, యాకయ్య, ప్రవీణ్, ఉపేందర్, పరశురాం, సతీష్, శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.