BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అర్నబ్ తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి ముందస్తు చర్యలు చేపట్టాలి..

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:17 PM
14 వీక్షణలు

సహాయక కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

అర్నబ్ తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సన్నద్ధతపై సమీక్షించారు. తుపాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉన్నందున అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ నుంచి తుపాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో 26వ తేదీ రాత్రి నుంచే అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సహాయక కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. వీలైనంత వరకు పోలింగ్ కేంద్రాలకు వేరుగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో చెట్లు కూలి రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా జేసీబీలు, పవర్ యంత్రాలు, ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ శాఖ అదనపు స్తంభాలు, మరమ్మతుల సిబ్బంది, క్రేన్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు తెగిపడిన సందర్భాల్లో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా తాగునీటి సరఫరా నిలిచిపోకుండా ఓవర్‌హెడ్ ట్యాంకులను ముందుగానే నింపాలని సూచించారు. మొబైల్ టవర్ల జనరేటర్లకు సరిపడా డీజిల్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రేషన్ దుకాణాలకు నిత్యావసర సరుకుల రవాణాను వేగవంతం చేసి ప్రజలకు ఆహార కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాలువలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక, చెత్త తొలగించాలని సూచించారు. గర్భిణులు, డయాలసిస్ రోగులు సహా అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని ముందుగానే గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం ప్రధాన లక్ష్యాలుగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి స్పష్టం చేశారు.