కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి: ఉన్నమట్ల ఎలిజ
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి: ఉన్నమట్ల ఎలిజ
తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ఉన్నమట్ల ఎలిజ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యులు, నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని ఉన్నమట్ల ఎలిజ కోరారు.