యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు
బీజేవైఎం నల్గొండ జిల్లా మీడియా కన్వీనర్గా నియామకం
నల్గొండ: చిట్యాల మున్సిపాలిటీకి చెందిన సిలివేరు నాగరాజును భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నల్గొండ జిల్లా మీడియా కన్వీనర్గా నియమించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్ ఈ నియామకాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు సూచించారు. యువతను సంఘటితం చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
తన నియామకంపై సిలివేరు నాగరాజు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. యువతను సంఘటితం చేసి, వారిని రాజకీయాల్లో భాగస్వాములను చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్కు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.