BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 07:51 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఎవరు?

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 07:51 PM
12 వీక్షణలు

సలీం, డాక్టర్ చెప్పలి కనకదుర్గ పేర్లపై చర్చ.. అన్నా రాంబాబు కుటుంబం నుంచి మరో అభ్యర్థి?

మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తొలుత సలీం పేరు తెరపైకి రాగా, తాజాగా మరికొందరి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో అభ్యర్థిత్వంపై స్పష్టత రావాల్సి ఉంది.

టీడీపీ తరఫున వక్కలగడ్డ మల్లికార్జున్‌ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో, ఆయనకు పోటీగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ పదవిని ఆశించిన డాక్టర్ చెప్పలి కనకదుర్గ మరోసారి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుటుంబం నుంచి ఒకరు బరిలోకి దిగవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

సలీం, డాక్టర్ చెప్పలి కనకదుర్గ, అన్నా రాంబాబు కుటుంబానికి చెందిన వ్యక్తి పేర్లు చర్చలో ఉండటంతో వైఎస్సార్‌సీపీ తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ అంశంపై స్పష్టత రానుంది.